🚨 నాసిక్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్
మహారాష్ట్రలోని నాసిక్‌లో నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టైంది. తాలేగావ్ గ్రామంలోని ఓ బంగ్లాలో నకిలీ నోట్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు.
రూ.10 లక్షల అసలు నోట్లకు రూ.30 లక్షల నకిలీ నోట్లు ఇచ్చే సమయంలో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Nashik #FakeCurrency #CrimeNews #Maharashtra #BreakingNews #DeshaTimes

