పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణి
వలిగొండ,ఆగస్టు14(దేశ టైమ్స్): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు “పాఠశాల అభివృద్ధిలో సమాజ సేవకులు అనే కార్యక్రమంలో” భాగంగా పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పోలీస్ విభాగంలో సిఐ గా విధులు నిర్వహిస్తున్న బత్తిని వెంకటేష్, పశు వైద్యాధికారులుగా విధులు నిర్వహిస్తున్న సిద్దగోని వెంకటరమణ రేఖ దంపతుల సౌజన్యంతో విద్యార్థులకు ఏక రూప దుస్తులు శుక్రవారం పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలకుంట్ల శ్రీనివాస్,
బత్తిని బాల్ శేట్టి, ఉపాధ్యాయులు మునగపాటి వరమ్మ, మామిడి కవిత, మణిమాల, ప్రశాంతి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

