ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెంలో అక్రమ మట్టి తరలింపులు, పంచాయతీ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ స్థలాల విక్రయం–కబ్జాలపై గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ప్రజావాణిలో జేసీకి ఫిర్యాదు చేశారు.
🔴 10–15 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారని ఆరోపణలు
🔴 సుమారు రూ.15 లక్షల పంచాయతీ నిధులపై అవకతవకల ఆరోపణలు
🔴 ప్రభుత్వ స్థలాన్ని సుమారు రూ.2 లక్షలకు విక్రయించారంటూ ఫిర్యాదు
🔴 అక్రమ మట్టి తరలింపులో జేసీబీలు, ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఫిర్యాదుపై స్పందించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, పంచాయతీ నిధులు మరియు ప్రభుత్వ స్థలాల వ్యవహారంపై విచారణ చేపట్టాలని డీఎల్పీవోను ఆదేశించినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.
#DeshaTimes #Khammam #Choppakatlapalem #BreakingNews #TelanganaNews #PublicIssues

