23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

అడిగింది ఒకటి.. చెప్పింది మరొకటి! ఆర్టీఐకి పొంతన లేని సమాధానం.. పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ దరఖాస్తుదారుడి ఆగ్రహం

Must read

📰 Generate e-Paper Clip

అడిగింది ఒకటి.. చెప్పింది మరొకటి!

 

ఆర్టీఐకి పొంతన లేని సమాధానం.. పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ దరఖాస్తుదారుడి ఆగ్రహం

బోనకల్, అక్టోబర్ 05,(దేశ టైమ్స్ )

 

 సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారానికి పూర్తి వివరాలు ఇవ్వకుండా, అడిగిన అంశాలకు పొంతన లేని సమాధానం ఇచ్చారంటూ బోనకల్ మండల విద్యాశాఖ అధికారుల తీరుపై ఓ దరఖాస్తుదారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మండలంలోని పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు కోరుతూ దరఖాస్తు చేసినప్పటికీ, అధికారులు ఇచ్చిన సమాధానంలో తాను కోరిన కీలక సమాచారం పూర్తిగా లేదని దరఖాస్తుదారు ఆరోపిస్తున్నారు.

 

ముఖ్యంగా ఎవరెవరు దరఖాస్తు చేశారు? వారి అర్హతలు ఏమిటి? ఎవరి ఆధారంగా ఎంపిక చేశారు? ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించారు? ఎంపికకు అనుసరించిన ప్రమాణాలేమిటి? వంటి అంశాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వలేదని ఆయన పేర్కొంటున్నారు.

 

అధికారులు మాత్రం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల వివరాలను ఆర్డీఓకు పంపినట్లు సమాధానంలో పేర్కొన్నారని, అయితే ఆ జాబితా, అభ్యర్థుల వివరాలు, ఎంపికకు సంబంధించిన ఆధారాలు, అనుసరించిన ప్రక్రియపై పూర్తి సమాచారం వెల్లడించలేదని దరఖాస్తుదారు అంటున్నారు. దీంతో ఎంపిక ప్రక్రియపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

 

అడిగింది ఒకటి.. చెప్పింది మరొకటి!

 

ఆర్టీఐ ద్వారా నిర్దిష్ట అంశాలపై సమాచారం కోరినప్పుడు, వాటికి సంబంధం లేని లేదా అసంపూర్తి వివరాలతో సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని దరఖాస్తుదారు ప్రశ్నిస్తున్నారు. సమాచారం కోరిన ప్రతి అంశానికి స్పష్టమైన, పత్రాధారాలతో కూడిన వివరాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

పోస్టుల భర్తీ వంటి అంశాల్లో పారదర్శకత అవసరమని, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. పూర్తి సమాచారం అందించకపోతే సమాచార హక్కు చట్టం ప్రకారం ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని దరఖాస్తుదారు వెల్లడించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.