27.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ఎమ్మెల్యే వేధింపులు..ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

*Breaking :- ఎమ్మెల్యే వేధింపులు..ఆత్మహత్యాయత్న ‼️*

 

– కొండయ్యపల్లి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..

– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధిస్తున్నారని ఆరోపణలు.. ఆస్పత్రికి తరలింపు

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి అలియాస్‌ వినయ్ సాగర్ ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండల కేంద్రంలోని ఎక్స్‌ రోడ్డు సమీపంలో క్రిమిసంహారక మందు తాగినట్లు సమాచారం.

 

వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

 

తనను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర మండలంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు సర్పంచులు వేధిస్తున్నారని, అవమానాలకు గురిచేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తిరుపతి ఆరోపించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

 

ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, సర్పంచ్ చేసిన ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది. సంబంధిత ఎమ్మెల్యే లేదా ఇతరుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.