*45 పైసలకు రూ.10 లక్షల రైలు ప్రయాణ బీమా.. ఐఆర్సీటీసీ ఆఫర్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారతీయ రైల్వే ప్రయాణికులకు కేవలం 45 పైసలకే రూ.10 లక్షల వరకు ప్రయాణ బీమాను అందిస్తోంది. ఈ పథకం రైలు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు, పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల వరకు, శాశ్వత వైకల్యానికి లేదా మరణానికి రూ.10 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.

