వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన అధికారులు
వలిగొండ :సెప్టెంబర్ 18: (దేశ టైమ్స్)మండల కేంద్రంలోని అక్కా చెల్లెళ్ళ చెరువు వద్ద వినాయక చవితి సందర్భముగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భముగా స్థానిక ఎంపిడిఓ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక మంటపం నిర్వాహకులు నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనాలకు తగు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.ఆయనతో పాటు తహసిల్దార్ దశరథ, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఆర్ ఐ నాగేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

