వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన అధికారులు
వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన అధికారులు వలిగొండ :సెప్టెంబర్ 18: (దేశ టైమ్స్)మండల కేంద్రంలోని అక్కా చెల్లెళ్ళ చెరువు వద్ద వినాయక చవితి సందర్భముగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భముగా స్థానిక ఎంపిడిఓ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక మంటపం నిర్వాహకులు నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనాలకు తగు ఏర్పాట్లు పూర్తి చేస్తామని...