23.7 C
Hyderabad
Saturday, October 24, 2026

పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యం – సీడీపీఓ కృష్ణశ్రీ

Must read

📰 Generate e-Paper Clip

పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యం

 

– సీడీపీఓ కృష్ణశ్రీ

బోనకల్, అక్టోబర్ 8 (దేశ టైమ్స్): గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ కృష్ణశ్రీ అన్నారు.

 

బోనకల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు ఐదుగురు గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముష్టికుంట్ల సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు గర్భిణీలకు చీరలు అందజేశారు.

 

ఈ సందర్భంగా సీడీపీఓ కృష్ణశ్రీ మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. తల్లులు తమ పిల్లలకు సమతుల్యమైన పోషకాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో లభించే ఆరోగ్య, పోషకాహార సేవలను ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని కోరారు.

 

అనంతరం బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి, ఉప సర్పంచ్ బానోతు కొండ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులకు రక్త పరీక్షలు కూడా నిర్వహించారు.

 

కార్యక్రమంలో ఏసీడీపీఓ షేక్ షకీరా, ఎంఈఓ దామాల పుల్లయ్య, ఎంపీడీఓ రూరావత్ రమాదేవి, సర్పంచులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.