23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన* *కార్గిల్‌ సొసైటీ చైర్మన్‌ రాంబాబు*

Must read

📰 Generate e-Paper Clip

*హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన*

*కార్గిల్‌ సొసైటీ చైర్మన్‌ రాంబాబు*

దేశ టైమ్స్

మహబూబాబాద్‌/మరిపెడ

సెప్టెంబర్‌ 19:

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులను కార్గిల్‌ సొసైటీ చైర్మన్‌ గాదె రాంబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరిపెడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాంబాబు న్యాయమూర్తులతో కొద్దిసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. మరిపెడ మండల కేంద్రంలో నూతన న్యాయస్థానం ప్రారంభం కావడం స్థానిక ప్రజలు, న్యాయవాదులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. కోర్టు అందుబాటులోకి రావడంతో ప్రజలకు న్యాయపరమైన సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. నూతన న్యాయస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తొర్రూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.వెంకటరత్నం, మరిపెడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.