హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన* *కార్గిల్ సొసైటీ చైర్మన్ రాంబాబు*
*హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన* *కార్గిల్ సొసైటీ చైర్మన్ రాంబాబు* దేశ టైమ్స్ మహబూబాబాద్/మరిపెడ సెప్టెంబర్ 19: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులను కార్గిల్ సొసైటీ చైర్మన్ గాదె రాంబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరిపెడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు న్యాయమూర్తులతో కొద్దిసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. మరిపెడ మండల కేంద్రంలో నూతన న్యాయస్థానం...