32.1 C
Hyderabad
Tuesday, September 15, 2026

మరిపెడలో ఘనంగా గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు*

Must read

📰 Generate e-Paper Clip

*మరిపెడలో ఘనంగా గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

దేశ టైమ్స్

మహబూబాబాద్/

మరిపెడ, సెప్టెంబర్ 5:

మరిపెడ మున్సిపాలిటీకి 12వ వార్డ్ కౌన్సిలర్ గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో నిర్వహించిన వేడుకలకు అభిమానులు, అనుచరులు, స్నేహితులు, స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్లు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గౌతమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా అభిమానులు, అనుచరుల సమక్షంలో గౌతమ్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు ఆయనను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. గౌతమ్ రెడ్డికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

 

జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. అభిమానులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని గౌతమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, మెరుగు రాము, పలువురు వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, యువకులు, అభిమానులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా గంట్ల గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంటికి వచ్చి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, స్నేహితులు, నాయకులు చూపిన ఆప్యాయత తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.