ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట **మిత్ర చైతన్య (21), హేమలత (20)**లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలో రూ.16 వేలకే 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో రూ.6 లక్షలకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడ్డారు.
ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయిస్తున్నట్లు చైతన్య పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
ఈ కేసులో గంజాయి విక్రయించిన భగవాన్ హంతాల్, కొనుగోలు చేయాల్సిన శశి, నాగుల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
#Khammam #Vaira #GanjaSmuggling #TelanganaNews #CrimeNews #BreakingNews #DeshaTimes

