జోగన్ పల్లి లో ఘనంగా చిట్యాల ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
కోరుట్ల, సెప్టెంబర్ 26 న్యూస్:
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి అనంతరం ఆమె జయంతి కి గుర్తుగా ఒక పూల మొక్క నాటారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చేసినటువంటి త్యాగాలను పోరాటాలను గుర్తు చేసుకొని , ఐలమ్మ పోరాటం.. కేవలం భూమి కోసం…భుక్తి కోసం మాత్రమే కాదని,వెట్టి చాకిరీ మరియు బానిసత్వం అనేది ఉండకూడదు అని ఆయుధం పట్టిందన్నారు, ఆమె నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం పోరాడాలని చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి,ఉప సర్పంచ్ ఎల్పుల అంబేద్కర్,మాజీ సర్పంచ్ దుంపల రాజనర్సయ్య గారు మరియు పల్లికొండ నరేష్ ,కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,మరియు పాక్స్ డైరెక్టర్ సామ నాగేశ్వర్ రెడ్డి, రజక సంఘ అధ్యక్షులు మారంపెల్లి తిరుపతి, ఉపాధ్యక్షులు మారంపెల్లి రాజశేఖర్, సలహాదారులు సట్ట శ్రీధర్, సట్ట రాజం మరియు రజక సంఘ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

