26.5 C
Hyderabad
Monday, September 14, 2026

షాకింగ్ హత్య.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య!

Must read

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

పొలం వద్ద జరిగిన గొడవలో దానయ్య కిందపడిపోగా.. భార్య శారద అతడి కాళ్లను పట్టుకోగా, రాపోలు శివ బండరాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

 

హత్య అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించిన నిందితులు.. పోలీసుల విచారణలో చిక్కారు. శివను పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

చౌటుప్పల్ | యాదాద్రి భువనగిరి జిల్లా

 

#CrimeNews #YadadriBhuvanagiri #Choutuppal #MurderCase #TelanganaNews #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.