ఆగస్టు 25: (దేశ టైమ్స్)
వలిగొండ : బాల్య వివాహలను అరికట్టాలని బాలల పరిరక్షణ విభాగo సోషల్ వర్కర్ మత్యగిరి అన్నారు. మంగళవారం మండలంలోని సంగేo ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ
పొక్సో చట్టంపై,పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై, మత్తు పదార్థలకు అలవాటు కాకుండా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం విద్యార్థుల చేత బాల్య వివాహాల నిర్మూలన కొరకు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్,స్కోప్ సంస్థ ప్రతినిధి నరసింహ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

