🔴 విజయనగరం :
*చెట్టును ఢీకొట్టిన పోలీసు వాహనం*
*బ్రేకులు ఫెయిల్*
*కానిస్టేబుల్ మృతి*
*ముగ్గురికి తీవ్ర గాయాలు*
పోలీసు వాహనం బోల్తా పడి ఓ కానిస్టేబుల్ మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కొండకరకాం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు దర్యాప్తు కోసం విజయనగరం రూరల్ పోలీసులు జీపులో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకాం వెళ్తున్నారు. ఈ క్రమంలో కొండకరకాం ఘాట్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో జీపు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్సై అశోక్‌కుమార్, కానిస్టేబుళ్లు నాగేంద్ర, వెంకటరమణ, డ్రైవర్ రాజాబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట రమణ (49) మృతిచెందారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

