26.5 C
Hyderabad
Monday, September 14, 2026

చంపాపేట్ కుమ్మరి బస్తీలో దారుణం*

Must read

📰 Generate e-Paper Clip

  • *చంపాపేట్ కుమ్మరి బస్తీలో దారుణం*

*చావు ఖర్చుల వివాదంతో అన్న హత్య*

*మల్కాజ్గిరి కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన*

హైదరాబాద్‌: తండ్రి చావు ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడు కత్తెరతో అన్నను పొడిచి హతమార్చిన ఘటన మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చంపాపేట కుమ్మరి బస్తీలో చోటుచేసుకుంది.

 స్థానికుల వివరాల ప్రకారం.. ముదావత్‌ వెంకటేష్‌(28) గత ఐదేళ్లుగా కుమ్మరి బస్తీలోని ఓ ఇంట్లో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి మరణించిన తర్వాత నివాసం కోసం తమ్ముడు శివ(26) కూడా అన్న ఉంటున్న కాలనీకి వచ్చి అక్కడే ఉంటున్నాడు.

తండ్రి అంత్యక్రియలు, ఇతర చావు ఖర్చులను వెంకటేష్‌ భరించగా.. అందులో తన వాటా ఇవ్వలేదని శివతో తరచూ గొడవలు జరిగేవి. గతంలోనూ అన్నదమ్ముల మధ్య పలుమార్లు వివాదాలు జరిగినట్లు తెలిసింది.

ఈ క్రమంలో శనివారం చావు ఖర్చుల విషయమై మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన శివ కత్తెరతో వెంకటేష్‌పై దాడి చేసి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.