23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ఈఎంఐల భారం.. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

ఈఎంఐల భారం.. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్

 

ఆదిలాబాద్ జిల్లా, దేశ టైమ్స్:

 

అప్పులు, నెలవారీ ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు భారంగా మారడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నింపింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

 

వ్యాపారంలో నష్టాలు.. పెరిగిన అప్పుల భారం

 

గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన దేవకతే సంతోష్ హైదరాబాద్‌లో బేకరీ నిర్వహించేవాడు. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఏడీసీసీ బ్యాంకు రుణం, క్రాప్ లోన్, హోమ్ లోన్ వంటి అప్పులు ఉండటంతో ఆర్థిక భారం పెరిగినట్లు సమాచారం.

 

మరోవైపు ఆదాయం సరిపోకపోవడం, భార్య ఆసుపత్రి ఖర్చులు, నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

 

స్వగ్రామానికి వచ్చి బలవన్మరణం

 

ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన లింగాపూర్‌కు వచ్చిన సంతోష్.. మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

పోలీసుల దర్యాప్తు

 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.