వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వలిగొండ : సెప్టెంబర్ 17 (దేశ టైమ్స్ )విద్యార్థులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చిన్నoశెట్టి రాణి మధు అన్నారు. గురువారం మండలంలోని గొల్లేపల్లి, నేమీలకాల్వ గ్రామాలలో చౌటుప్పల్ లోని దివిస్ వారి సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేశారు. అనంతరం విద్యార్థులకు సుమారుగా ఒక లక్ష రూపాయల నోటు పుస్తకాలు అందజేశారు.విద్యార్థులు ఉచిత వైద్య శిబిరన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత యాదయ్య, వైద్యులు జయంత్ కుమార్, నరేష్,దివిస్ ప్రతినిధులు గోపి, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

