24.3 C
Hyderabad
Saturday, October 31, 2026

73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో మువ్వ విజయ్ బాబుతో ప్రముఖుల భేటీ

Must read

📰 Generate e-Paper Clip

73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో మువ్వ విజయ్ బాబుతో ప్రముఖుల భేట

 

ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్ 30 (దేశ టైమ్స్):

 

సత్తుపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న 73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన మాజీ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబును పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు.

 

చల్లా రామకృష్ణారెడ్డి, వెనిగళ్ల నాగేశ్వరరావు, కరాటే వేణు, దుర్గ, డీఎస్‌ఎన్ రాజు తదితరులు మువ్వ విజయ్ బాబుతో ఆత్మీయంగా ముచ్చటించారు.

 

ఈ సందర్భంగా మహిళల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి టోర్నమెంట్లు మహిళా క్రీడాకారిణుల్లో క్రీడాస్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కటి వేదికగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటున్న మహిళా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకుంటూ కబడ్డీ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహిళా క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్ధికి ఇటువంటి టోర్నమెంట్లు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.