📍*భారత్‌లో నవంబర్ 1 నుంచి తప్పనిసరి కానున్న CNAP విధానం
భారత్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ (CNAP) విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం.
దీనివల్ల ఫోన్ చేసే వ్యక్తి పేరు నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ట్రాయ్ సిఫార్సుల మేరకు టెలికాం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, వినియోగదారుల ప్రైవసీ దెబ్బతినకుండా కాల్ ముగిసిన తర్వాత వివరాలను దాచకూడదని నిబంధన విధించింది.
ఈ విధానంతో అపరిచిత, మోసపూరిత కాల్స్ తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

