జనసైనికుల త్యాగాలు మర్చిపోవద్దు: పవన్ కళ్యాణ
Oct 11, 2026,
జనసైనికుల త్యాగాలు మర్చిపోవద్దు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ : ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి కోసం కష్టపడిన జనసైనికులు, వీరమహిళల త్యాగాలను గుర్తించి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నాయకులకు సూచించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

