సూది గుచ్చకుండా.. చుక్క రక్తం తీయకుండా..
60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు
మంగళగిరి: సూది గుచ్చకుండా, చుక్క రక్తం తీయకుండా కేవలం 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే అత్యాధునిక ఏఐ సాంకేతికత గుంటూరు జిల్లా మంగళగిరిలో అందుబాటులోకి వచ్చింది. ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ఏరోస్ వెల్నెస్ ఏఐ క్లినిక్’ను అధికారులు ప్రారంభించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల తర్వాత ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఫేస్ స్కానింగ్‌తో ఆరోగ్య పరీక్షలు
ఈ ఏఐ క్లినిక్‌లో కెమెరా ముందు కొన్ని క్షణాలు నిలబడగానే ముఖంలో కనిపించే సూక్ష్మ మార్పులను, నాడి సంకేతాలను కృత్రిమ మేధస్సు విశ్లేషిస్తుంది. రక్త నమూనాలు సేకరించకుండానే ప్రాథమికంగా 28 రకాల ఆరోగ్య పరీక్షల ఫలితాలను గుర్తిస్తుంది. అనంతరం ఐఓటీ సాంకేతికతతో అనుసంధానించిన పరికరాల ద్వారా మరో 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాలను డిజిటల్ రూపంలో అందిస్తుంది.
ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు
ఈ సాంకేతికత ద్వారా బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య సూచనలను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా ప్రజలు ముందస్తు వైద్య సలహాలు తీసుకునేందుకు వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం
ప్రస్తుతం మంగళగిరిలోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఏఐ క్లినిక్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహిస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ సాంకేతికతను విస్తరించే దిశగా అధికార�

