27.9 C
Hyderabad
Monday, September 14, 2026

శ్రీశైలంలో తీవ్ర విషాదం వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సత్రం గదిలో ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కు ఉరేసుకోగా, ముగ్గురు మహిళలు బాత్రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను పల్లపు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు.

ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

📍 శ్రీశైలం | నంద్యాల జిల్లా

#Srisailam #BreakingNews #AndhraPradesh #DeshaTimes #CrimeNews

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.