కోర్టు తీర్పుతో మనస్తాపం.. కూతురిని కాల్చి చంపి తల్లి ఆత్మహత్య
హ్యూస్టన్, అక్టోబర్ 4: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి కస్టడీకి సంబంధించిన కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఆమె తల్లి దారుణానికి పాల్పడింది. తన నాలుగేళ్ల కుమార్తె వివియన్ సెవెల్లాను తుపాకీతో కాల్చి చంపిన అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సెప్టెంబర్ 29న వెస్ట్ హ్యూస్టన్‌లోని టెర్రా రిజర్వ్ ప్రాంతంలో జరిగింది. కుటుంబ న్యాయస్థానంలో జరిగిన విచారణలో చిన్నారి తండ్రి ఆరోన్ సెవెల్లాకు ప్రాథమిక సంరక్షణ హక్కులు అప్పగించినట్లు కోర్టు పత్రాలను...