ఆటోడ్రైవర్ పైశాచికం.. ఒంటరిగా ఎక్కిన మహిళను గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి దారుణం
తూర్పుగోదావరి: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఆటోడ్రైవర్ బంగారు ఆభరణాల కోసం గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడిన ఘటన తాళ్లపూడి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమకు చెందిన ఆదిలక్ష్మి (36) భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం పుట్టింటివారి వద్ద ఉంటూ తాళ్లపూడిలోని ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీలను...