DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 3:28 pm Posted by : DESHA TIME

సేవా కార్యక్రమాల్లో భాగం సేవా ఫౌండేషన్ ముందడుగు

సేవా కార్యక్రమాల్లో భాగం సేవా ఫౌండేషన్ ముందడుగు

అంగన్‌వాడీకి గేటు, పాఠశాలకు సూచిక బోర్డుల ఏర్పాటుకు రూ.20 వేల ఆర్థిక సాయం

 

బోనకల్, అక్టోబర్ 30(దేశ టైమ్స్ )

 

సేవా కార్యక్రమాల్లో భాగంగా భాగం సేవా ఫౌండేషన్ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

 

మండల పరిధిలోని గోవిందాపురం (ఎ) గ్రామానికి చెందిన ఎన్నారై యువకుడు, భాగం సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు భాగం రాకేష్ గ్రామంలోని అంగన్‌వాడీ భవన సముదాయ ప్రాంగణానికి గేటు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రాథమిక పాఠశాలకు సూచిక బోర్డుల ఏర్పాటుకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఇదే పాఠశాల భవనానికి పూర్తిస్థాయిలో రంగులు వేయించి తన సేవా నిరతిని చాటుకున్న ఆయన, తాజాగా మరోసారి మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనందించారు. అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలను త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా భాగం రాకేష్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందన్నారు. తల్లిదండ్రులు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కోరారు. చదువుల్లో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు తమ ఫౌండేషన్ అండగా నిలుస్తూ, ఉన్నత విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు భాగం రాధాకృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ ఇసరం కరుణ, భాగం పాపారావు, కావూరి శంకరయ్య, అంగన్‌వాడీ టీచర్ నాగమణి, సురేష్ రాయప్ప, గోపి తదితరులు పాల్గొన్నారు.