వాచ్‌మెన్‌గా వచ్చి చిన్నారిని హత్య చేయడం దారుణం: ఎంపీ ఈటల రాజేందర్
మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచాలి
హైదరాబాద్, అక్టోబర్ 11 (దేశ టైమ్స్): హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులు, డ్రైవర్లు, వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్న కొందరు మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
బీహార్‌కు చెందిన ఓ వాచ్‌మెన్ డ్రగ్స్‌కు బానిసై ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిపై జరిగిన ఈ దారుణం బాధాకరమని పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉపాధి కల్పించే మ్యాన్‌పవర్ ఏజెన్సీలు బాధ్యతగా వ్యవహరించాలని ఈటల రాజేందర్ సూచించారు. ఉద్యోగాల్లో నియమించే వ్యక్తుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మత్తు పదార్థాల వినియోగం లేదా నేరపూరిత ప్రవర్తనకు సంబంధించిన అనుమానాలు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఏజెన్సీలు, యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నివాస ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు.