* *కరక్కాయ కన్నతల్లి లాంటిది*
*కరక్కాయ గుణాలు
కరక్కాయను కన్నతల్లితో ఫోలుస్తారు. ఎందుకంటే కన్నతల్లి ఎలా అన్ని విధాలుగా కాపాడుతుందో, అదే విధంగా కరక్కాయ, అన్ని జబ్బులను రాకుండ చేయటానికి, వస్తే పోగొట్ట టానికి ఉపయోగపడుతుంది. కరక్కాయల్లో అనేక జాతులున్నా “విజయ” అనేకరక్కాయ సకల రోగాలలోను ఉపయోగించ దగినది. ఈ కరక్కాయ గుండ్రంగా, దళసరిగల బెరడుతో వుంటుంది. ఇందులో ఒక్క ఉప్పు రుచి తప్ప మిగిలిన ఐదు రుచులు వున్నయ్. పంచమహాభూతాల సుగుణాలు, శక్తులు ఈ కరక్కాయలో పుష్కలంగా వున్నయ్. దీనికి వేడి చేసే గుణముంది. ఇది బాగా సుఖ విరేచనం చేస్తుంది. కళ్ళకు, ఉదరానికి, వెంట్రుకలకు, బుద్ధికి అద్భుతమైన శక్తినిచ్చే అనేక పోషక విలువల నిలువలు
సరిగల బెరడుతో వుంటుంది. ఇందులో ఒక్క ఉప్పు రుచి తప్ప మిగిలిన ఐదు రుచులు వున్నయ్. పంచ మహాభూతాల సుగుణాలు, శక్తులు ఈ కరక్కాయలో పుష్కలంగా వున్నయ్. దీనికి వేడి చేసే గుణముంది. ఇది బాగా సుఖ విరేచనం చేస్తుంది. కళ్ళకు, ఉదరానికి, వెంట్రుకలకు, బుద్ధికి అద్భుతమైన శక్తినిచ్చే అనేక పోషక విలువల నిలువలు
చేసుకోవాలి. ఔషధాన్ని ప్రతిరోజూ భోజనానికి ముందుగా 5గ్రా. మోతాదుగా మజ్జిగతో సేవిస్తూ వుంటే రక్త మొలలు హరించిపోతయ్.
*సమస్త ఉదరరోగాలకు*
ఆరు రుతువులపాటు కర ఖ క్కాయ చూర్ణాన్ని తగిన అను పానా లతో సేవిస్తూవుంటే సమస్త ఉదర వ్యాధులతో పాటు, అన్ని రకాల వ్యాధులు అంతరించిపోతయ్.
*వాంతులకు*
దోరగా వేయించిన కరక చూర్ణంతో తేనె కలిపి అరచెంచా మోతాదుగా సేవిస్తూవుంటే వాంతులు కట్టుకుంటయ్.
*మూత్ర సంచిలో రాళ్ళకు*
ప్రతిరోజూ 2 పూటలా 1 కప్పు పాలల్లో అర టీ స్పూన్, వేయించిన కరక చూర్ణం కలిపి తాగుతూ వుంటే రాళ్ళు కరిగిపోతయ్
*బలానికి*
కరక్కాయను నేతిలో దోరగా వేయించి తింటూవుంటే శరీరానికి అమితమైన బలం కలుగుతుంది.
*సమస్తకంటి వ్యాధులకు*
కరక్కాయ చూర్ణాన్ని, ఆవు నెయ్యిలో వుడికించి కన్నులపై వేసి కట్టాలి. అదే ఔషధాన్ని రెండున్నర గ్రాముల మోతాదుగా లోపలకు తీసుకోవాలి. ఇలాచేస్తే అన్ని రకాల నేత్రరోగాలు హరించిపోతయ్.
*మద్యం తాగిన మత్తుకు*
కరక కషాయంలో పాలుకలిపి తాగితే వెంటనే ఎంత మద్యం తాగి మత్తు అయినా క్షణాల మీద తగ్గి పోతుంది.
*ఉబ్బు రోగానికి*
కరక్కాయ చూర్ణం, బెల్లం సమంగా కలిపి దంచి పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా రెండుపూటలా తింటూ వుంటే శరీరమంతా నీరుపట్టి వచ్చిన. ఉబ్బురోగాలు హరించిపోతయ్.
*రక్తవాంతులకు*
కరక్కాయలను విత్తనాలు తీసివేసి అడ్డసరం ఆకురసంలో ఒక రాత్రి నానబెట్టి, ఒక పగలు ఎండబెట్టాలి. ఇలా 7 రాత్రులు నానబెట్టి, 7 పగళ్ళు ఎండబెట్టిన తరువాత, ఆ ముక్కలను నీడలో ఎండే వరకు ఆరబెట్టి, పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడితో సమానంగా దోరగా వేయించిన పిప్పళ్ళ చూర్ణాన్ని కలిపి వుంచుకోవాలి. ఈ చూర్ణాన్ని అరచెంచా మోతాదుగా తేనెతో కలిపి రెండుపూటలా సేవిస్తూ వుంటే ఎంత అసాధ్యమైన రక్తవాంతులైనా క్షణంలో కట్టుకుంటయ్.
*మల బద్ధకం గల మూల శంకలకు*
రాత్రిపూట గోవుమూత్రంలో కరకచూర్ణాన్ని నానబెట్టి, ఉదయమే ం తీసి దానికి సమంగా బెల్లం కలిపి నూరి, తింటూ వుంటే మలబద్ధకం, న దానితో కూడిన మూల శంకలు
హరించి పోతాయ్…