స్మార్ట్ రేషన్ కార్డులో పేరు తప్పుగా వచ్చిందా.. సరిచేసుకునే అవకాశం

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కొనసాగిస్తోంది. అయితే కొందరి కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వివరాలను సరిచేసుకునేందుకు డిజిటల్ మార్గాలు అందుబాటులో ఉన్నాయని సమాచారం. తెలంగాణ పౌరసరఫరాల శాఖకు చెందిన T-Ration మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను శాఖ, ఎన్‌ఐసీ తెలంగాణ సహకారంతో అభివృద్ధి చేసినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. రేషన్ కార్డులో పేరు లేదా...