పల్నాడులో యువకుడి దారుణ హత్య

దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురం నాయుడు బిల్డింగ్ సమీపంలో శ్రీనివాసరావు (32) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసరావును హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న దాచేపల్లి సీఐ షేక్ ఖాజావలి, ఎస్సై పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరికొద్ది సేపట్లో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించనుంది. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం...