విశాఖకు వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి.. శ్రీకాకుళంలో అనుమానాస్పద మృతి

    శ్రీకాకుళం (దేశ టైమ్స్): ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అస్సాంకు చెందిన యువతి హిమశ్రీ బోరో (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విశాఖపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన డ్యాన్స్‌ బృందంతో కలిసి వచ్చిన ఆమె, తిరుగు ప్రయాణంలో అదృశ్యమై.. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్‌ పక్కన మృతదేహంగా కనిపించింది.   అస్సాంలోని గౌహతికి చెందిన హిమశ్రీ బోరో అక్టోబర్‌ 6న కన్యాకుమారి–దిబ్రూగఢ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అదృశ్యమైనట్లు సమాచారం. అదృశ్యం కావడానికి ముందు తెల్లవారుజామున 2:39 గంటలకు తన స్నేహితుడికి...