విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృత
Oct 11, 2026,
విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి
తెలంగాణ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ పండుగ ఏర్పాట్లలో భాగంగా గ్రామంలో విద్యుత్ బల్బులు అమర్చుతుండగా విద్యుత్ షాక్ తగిలి బౌతు కరుణాకర్ (20) అనే యువకుడు మృతి చెందాడు. స్తంభం ఎక్కి బల్బులు అమర్చే క్రమంలో ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరుణాకర్ మృతిపై పలు ఆరోపణలు చేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.