విశాఖ హైవేపై రూ.8.98 కోట్ల బంగారం..!
విశాఖ హైవేపై రూ.8.98 కోట్ల బంగారం.. కారు సీటు కింద విదేశీ బంగారం.. వెంబడించి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు..! విశాఖపట్నం జాతీయ రహదారిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన మూడు ప్యాకెట్లలో మొత్తం 5,832.90 గ్రాముల విదేశీ బంగారం కడ్డీలు గుర్తించారు. వీటి...