దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వైభవ్ సంచలనం.. సిరాజ్‌పై 4, 6, 4తో విరుచుకుపడ్డ 15 ఏళ్ల యువ బ్యాటర్!

చెన్నైలోని ప్రతిష్టాత్మక చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, అంతర్జాతీయ అనుభవం ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా సిరాజ్ వేసిన ఓ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ (4,6,4) బాది స్టేడియంలో ఉత్సాహాన్ని నింపాడు.  అయితే భారీ స్కోరు సాధించే దిశగా సాగుతున్న వైభవ్ ఇన్నింగ్స్ 44...