హన్మకొండలో నడి రోడ్డుపై విషాదం
డివైడర్‌పై చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది.
సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.