వినాయక విగ్రహం కోసం వెళ్లిన చోటే విషాదం.. ఘర్షణలో వ్యక్తి మృతి!

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో విషాద ఘటన మేడ్చల్–మల్కాజిగిరి: వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి ఓ యువకుడి మృతికి కారణమైన విషాద ఘటన పోచారం ఐటీ కారిడార్ పరిధిలో చోటుచేసుకుంది. జోడిమెట్ల సమీపంలో వినాయక విగ్రహం కొనుగోలు, ధర విషయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చౌదరిగూడకు చెందిన **కిరణ్ (34)**పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను చికిత్స నిమిత్తం సూర్య ఆసుపత్రికి తరలించారు....