*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.*
*ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించాలి.*
*జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.*
దేశ టైమ్స్
మహబూబాబాద్/మరిపెడ సెప్టెంబర్ 17
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని, ఉద్యోగులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలన్నారు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తం, లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెండు పడకల గదుల నిర్మాణం పై సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులలో వేగం పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పూరి గుడిసె ఉన్న వారి వివరాలు సేకరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించి, నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, వివిధ దశలలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లకు బిల్లులు మంజూరు చేయాలని, రెండు పడకల గదుల నిర్మాణం లో కూడా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు,
రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ఉద్యోగులు సైతం బాధ్యతయుతంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, తెలిపారు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్స్, సిబ్బంది, క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 2 వీలర్స్ పై వెళుతున్న క్రమంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని, కోరారు హౌసింగ్ ఉద్యోగులకు (22) మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు,
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత పై అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీరు మీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అబ్దుల్ హకీమ్, రాజన్న, అసిస్టెంట్ ఇంజనీర్స్, సిబ్బంది పాల్గొన్నారు.