మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసిన నిందితుడు అరెస్ట్..!
హనుమకొండ: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని శుక్రవారం అంబాల–కమలాపూర్ రోడ్డులో వాహన తనిఖీల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి పరిధికి చెందిన తౌటం స్వప్న (40) మే 15న అదృశ్యమైంది. ఆమె తండ్రి అమంచ రాజేందర్ ఫిర్యాదు మేరకు మే 31న హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో...