DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:29 pm Posted by : DESHA TIME

మరిపెడలో నూతన సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన.

మరిపెడలో నూతన సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన.

ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్.

 

దేశ టైమ్స్

మహబూబాబాద్

మరిపెడ,సెప్టెంబర్ 17

 

మరిపెడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న సివిల్ కోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా కోర్టు ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి,శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు,ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.

నూతన సివిల్ కోర్టు ఏర్పాటు ద్వారా మరిపెడ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్,సర్పంచులు,మండల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు..