DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 10:16 am Posted by : DESHA TIME

రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ.. 9వ తరగతి బాలుడు మృతి

కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోవడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు 9వ తరగతి విద్యార్థులకు తీవ్ర ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు లోకేష్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. కారు నడిపింది కూడా మైనర్ బాలుడేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

#Kamareddy #RoadAccident #CCTVFootage #BreakingNews #DeshaTimes