విద్యార్థుల సౌకర్యాలపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ
యూనిఫామ్స్, షూస్, టై, బెల్టుల పంపిణీ.. పాఠశాలకు ఫ్యాన్లు, షటిల్ కోర్టు పోల్స్ అందజేత
పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానన్న
సర్పంచ్ తుడుసు నాగార్జున
దేశ టైమ్స్
మహబూబాబాద్
సెప్టెంబర్ 26:
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు వారి సౌకర్యాల కోసం అవసరమైన వసతులను సమకూర్చేందుకు కందికొండ గ్రామ సర్పంచ్ తుడుసు నాగార్జున ప్రత్యేక చొరవ చూపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోకందికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్స్, షూస్, టై, బెల్టులను పంపిణీ చేశారు.
పాఠశాల ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు, ఎమ్మెల్యే సూచనల మేరకు సర్పంచ్ తుడుసు నాగార్జున పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్స్, షూస్, టై, బెల్టులను అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
*పాఠశాలకు ఫ్యాన్లు అందజేత*
పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సౌకర్యాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ నాగార్జున పాఠశాలకు ఫ్యాన్లను అందజేశారు. విద్యార్థులకు తరగతి గదుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు సహకారం కొనసాగిస్తానని తెలిపారు.
పాఠశాల అభివృద్ధి విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని పనులు చేపట్టేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
*విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం*
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సర్పంచ్ నాగార్జున పేర్కొన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచేలా ప్రోత్సహించాలన్నారు. ఇందులో భాగంగా పాఠశాల గ్రౌండ్లో విద్యార్థులు షటిల్ ఆడేందుకు అవసరమైన పోల్స్‌ను సర్పంచ్ స్వయంగా అందజేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి కొద్దిసేపు షటిల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. సర్పంచ్ తమతో కలిసి ఆట ఆడటంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన క్రీడా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
*మెరుగైన విద్యాబోధన అందించాలి*
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో సర్పంచ్ మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, విద్యతో పాటు క్రమశిక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుండేలా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంలో గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు అంబడిపూడి ఇసాకర్, తోట మహేష్, తుడుసు అనిత (దేవేందర్), మెట్టు ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ హేమలత, యూత్ అధ్యక్షుడు మాచర్ల వెంకటేష్, పార్టీ నాయకులు సుశాంత్, బిక్షపతి, అల్వాల నవీన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.