గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనలు వలిగొండ, సెప్టెంబర్ 08 (దేశ టైమ్స్): వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ముందు పోలీస్‌శాఖతో పాటు విద్యుత్‌శాఖ, మున్సిపల్‌/గ్రామ పంచాయతీ అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటు వల్ల ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో నిర్ణీత సమయం దాటిన తర్వాత...