కెసిఆర్ ప్రతిపక్ష హోదాఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ
వలిగొండ :సెప్టెంబర్ 3:( దేశ టైమ్స్)
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కెసిఆర్ తన ప్రతిపక్ష హోదాకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వలిగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకి రాములు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష హోదాను కలిగి ఉండి అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని అటువంటి వ్యక్తి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని వారు తెలిపారు కెసిఆర్ ప్రతిపక్ష హోదాలో ఉండి ఇప్పటివరకు 27 కోట్ల కు పైగా వేతనాన్ని తీసుకున్నాడని కానీ ప్రజా సమస్యలపై ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి చర్చించడం లేదని వారన్నారు ఇప్పటికైనా కెసిఆర్ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదాకి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి వలిగొండ సింగిల్ విండో చైర్మన్ గరిసే రవి వైస్ చైర్మన్ జంగారెడ్డి నాయకులు బద్దం సంజీవరెడ్డి గుండు దానయ్య గౌడ్ కొండూరు భాస్కర్ కాసుల వెంకన్న గౌడ్ బత్తిని నాగేష్ ఐటిపాముల రవీంద్ర గంగదారి రాములు వలిగొండ ఉపసర్పంచ్ మలగ మాధవి వెంకటేష్ చిలుగూరు సత్తిరెడ్డి ఇంకాప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.