ఢిల్లీ భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సత్య నికేతన్‌లో హాస్టల్ భవనం కూలిన ఘటన తీవ్రంగా కలచివేసింది. తమ ఆప్తులను కోల్పోయిన వారికి నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని అన్నారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు చెప్పారు....