విమానాశ్రయాల అభివృద్ధితో తెలంగాణకు కొత్త రెక్కలు
మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తయితే ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం తెలంగాణ అభివృద్ధిలో రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక కారిడార్లతో పాటు విమానయాన మౌలిక వసతులు కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన విమానయాన కేంద్రంగా కొనసాగుతున్నప్పటికీ, ఇతర ప్రాంతాలకు విమాన సౌకర్యాలు విస్తరించాల్సిన అవసరం చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాలకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది....