DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 1:56 pm Posted by : DESHA TIME

మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య హాస్టల్ గదిలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి మృతి

హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వారాహి బాయ్స్ హాస్టల్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థి సాయిచరణ్ (20) ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.

సాయిచరణ్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత మూడేళ్లుగా వారాహి బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నట్లు సమాచారం.

తెలిసిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో సాయిచరణ్ స్నేహితులు సినిమాకు వెళ్లారు. ఆ సమయంలో సాయిచరణ్ ఒక్కడే గదిలో ఉన్నాడు. అనంతరం తలుపు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.