డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి వల.. రూ.21 లక్షలు స్వాహా!
ఎల్బీనగర్‌లో సైబర్ నేరగాళ్ల మోసం
ఆర్కేపురం కాలనీకి చెందిన 68 ఏళ్ల నాగలక్ష్మి ఒంటరిగా నివాసం
టెలికాం అధికారినంటూ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్
అనంతరం న్యాయ సలహాదారుడినంటూ రాజేశ్‌కుమార్ పరిచయం
అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ చేస్తామని బెదిరింపులు
పోలీసులు, సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్‌లో విచారణ
అరెస్టు భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వృద్ధురాలు
నిందితులు సూచించిన ఖాతాలకు రూ.21 లక్షలు బదిలీ
మరింత డబ్బు పంపాలంటూ నిందితుల ఒత్తిడి
ఈ నెల 5న కుమారుడికి విషయం చెప్పిన బాధితురాలు
కుమారుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసుల దర్యాప్తు
పోలీసులు, సీబీఐ పేరుతో బెదిరిస్తే డబ్బులు బదిలీ చేయొద్దని అధికారుల సూచన