మధ్యలో దూరితే పాత్‌పై దాడి చేస్తాం.. హౌతీల వార్నింగ్
✒️మధ్యలో దూరితే పాత్‌పై దాడి చేస్తాం.. హౌతీల వార్నింగ్ సౌదీ అరేబియా విషయంలో సైనిక జోక్యం చేసుకోవద్దని పాకిస్థాన్, తుర్కియేను హౌతీలు హెచ్చరించారు. ఈ రెండు దేశాలు తమ దళాలను మోహరిస్తే ప్రతీకార దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 'పాక్, తుర్కియే మధ్య లోకి వస్తే ఉక్కు పిడికిలితో అణచివేస్తాం. వాటికి గుణపాఠం నేర్పిస్తాం' అని హౌతీల ఆధ్వర్యంలోని ధమర్ గవర్నర్ మహ్మద్ అల్ బుఖైటి స్పష్టంచేశారు. నిన్న రియాద్‌పై హౌతీలు మిస్సైళ్లతో దాడులు చేశారు.